Site icon TeluguMirchi.com

Narivetta : ఓటీటీలోకి టొవినో థామస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ ‘నరివెట్ట’..


Narivetta : ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న మలయాళ యాక్షన్-డ్రామా ‘నరివెట్ట’ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ సోనీ లివ్‌లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించగా, టొవినో థామస్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఓ యువ పోలీస్ కానిస్టేబుల్‌గా వర్గీస్ పాత్రలో నటించిన టొవినో, వయనాడ్ ప్రాంతంలో తలెత్తిన ఆదివాసీ భూ సమస్యలపై పోరాడే విధానాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు.

ఈ చిత్రంలో టొవినోతో పాటు సూరజ్ వెంజరమూడు, చేరన్, ప్రియంవద కృష్ణన్, ఆర్య సలీం, ప్రణవ్ టియోఫిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ‘నరివెట్ట’ ఆలోచింపజేసే సామాజిక కథా చిత్రంగా నిలిచింది. ఇది ఆలోచింపజేసే ఓ ఎంగేజింగ్ డ్రామా. అందరూ తప్పక చూడవలసిన చిత్రం.

Exit mobile version