Site icon TeluguMirchi.com

Sattamum Neethiyum : ఆగస్ట్ 1న ZEE5లో రాబోతోన్న ‘సట్టముమ్ నీతియుమ్’.. తమిళ హిట్ ఇప్పుడు తెలుగులో!

Zee5
Sattamum Neethiyum : ప్రేక్షకులకు ప్రతిసారీ భిన్నమైన కంటెంట్‌ను అందిస్తూ ముందుకెళ్తున్న ZEE5 ఇప్పుడు మరో విభిన్నమైన కోర్ట్ డ్రామాను తెలుగు, హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైంది. తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సట్టముమ్ నీతియుమ్’ ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే జూలై 18 నుండి తమిళ వెర్షన్‌ ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.

‘సట్టముమ్ నీతియుమ్’ ను బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో 18 క్రియేటర్స్ బ్యానర్‌పై శశికళ ప్రభాకరన్ నిర్మించారు. కోర్ట్ డ్రామా నేపథ్యంలో ఉత్కంఠభరిత సన్నివేశాలు, భావోద్వేగ ఘర్షణలు, సామాన్యుడి పోరాటాన్ని చక్కగా ఆవిష్కరించే ఈ సిరీస్ ప్రేక్షకులను మేకర్స్ ఆశించిన మేర ఆకట్టుకునే అవకాశం ఉంది. ఆగస్ట్ 1న తెలుగు, హిందీ భాషల్లోకి ఈ సిరీస్ రాబోతోన్న తరుణంలో

నటుడు శరవణన్ మాట్లాడుతూ .. ‘సట్టముమ్ నీతియుమ్’ కథ విన్న వెంటనే అది నా మనసును తాకింది. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామా కాదు. ఈ కథ సామాన్యుడి బలం గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడే ఓ కామన్ మెన్‌ను చూపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగం అవ్వాలని కథ విన్నవెంటనే నిర్ణయించుకున్నాను. 15 ఏళ్ల తరువాత మళ్లీ ఇలాంటి ఓ శక్తివంతమైన పాత్రను పోషించాను. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు బాలాజీ సెల్వరాజ్‌కు, ZEE5 టీంకి నేను కృతజ్ఞుడను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.

Exit mobile version