తెలుగులో ఈ మధ్యకాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మేకర్స్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో మధుదీప్ చెలికాని దర్శకత్వంలో తెకెక్కిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్‌తో సినిమాపై అంచనాలు పెంచేలా చేశారు మేకర్స్. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? అన్నది మూవీ రివ్యూలో చూద్దాం.
కథ:
అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి స్వదేశానికి తిరిగి వస్తాడు. అంతేకాదు ఇక్కడ సొంతంగా ఏదైనా చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రసాయన ఎరువుల కారణంగా భూములు నిస్సారమవుతున్నాయి. అంతేకాదు ప్రస్తుత మనుషులు ఈ రసాయన ఎరువుల వల్ల పండిన పంటను తినడం వల్ల వారి ఆయుస్సు తగ్గిపోతుంది. ఈ క్రమంలో అరవింద్ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటాడు. వ్యవసాయంలో కొత్త తరహా పద్దతులను ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచేడానకి ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే యాప్ తీసుకొస్తాడు. మధ్యలో మహి (పాయల్ రాధాకృష్ణ)తో అరవింద్ ప్రేమలో పడతాడు. అతను ఉద్యోగం చేయడం లేదని అతని ప్రేమను అంగీకరించడానికి నిరాకరిస్తుంది మహి. అరవింద్ వ్యవసాయంలో తనతో పాటు మిగతా రైతుల తలరాతను మార్చాడా?, మహి తన మనసు మార్చుకుందా?, చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయాకొనిస్తే:
దర్శకుడు మధుదీప్ చెలికానీ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టైటిల్‌తోనే ఈ సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సాధారణంగా ఇలాంటి టైటిల్‌తో సినిమా వస్తుందంటనుకుంటే.. ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి సంబంధించిన స్టోరీ అనుకుంటారు. ఇందులో కూడా హీరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆ జాబ్ చేసి బోర్ కొట్టి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటాడు. మారుతున్న జీవన శైలి వల్ల మనలో చాలా మందికి ఎన్నో అనారోగ్యాలు చుట్టు ముడుతున్నాయి. 40 యేళ్ల లోపు షుగర్, బీపీ సహా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వాటిన్నింటికి కారణంగా మన పూర్వీకులు తీసుకున్న ఆహారాన్ని మనం తీసుకోకపోవడమే. అప్పట్లో ఎలాంటి ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్దతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్ద వాళ్లు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉండేవారు. కానీ నేటి తరం అలా ఉండటం లేదు. వారికి మిల్లెట్ల ఆవశ్యకతను ఎవరు సరిగా వివరించ లేదు. ఇందులో హీరో కూడా వ్యవసాయంలో మళ్లీ సంప్రదాయ కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి తక్కువ పెట్టుబడితో ఉన్న టెక్నాలజీ తో ఎక్కువ దిగుబడులు వచ్చేలా చేస్తాడు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. డీఓపీ అద్భుతంగా ఉంది. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బాగుంది.
మహేష్ బాబు మహర్షి సినిమాలో కూడా రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా కూడా రైతుల గురించే ఆలోచింప జేస్తుంది?. రైతులు కూడా ఎరువులు వాడి వాడి భూములు నిస్సారం అవుతున్నాయి. దీంతో వాటిని ఫ్లాట్స్ గా విక్రయిస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు.. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడారు. తాజాగా ఢిల్లీలో కూడా ప్రధాని వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఈ సినిమాలో అదే చూపించారు. ప్రధాని మాట్లాడిన వారంలోపే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంది.
నటీనటుల విషయానికొస్తే:
త్రిగుణ్ తన నటనతో మెప్పించాడు. అతని చూస్తుంటే హీరో రామ్ పోతినేని గుర్తుకు వస్తాడు. కొన్ని యాంగిల్స్ లో అతనిలా కనబడ్డాడు కూడా. ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ అందంగా కనిపించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, ఆర్గానిక్ వ్యవసాయం వైపు హీరోను టర్న్ చేసే పాత్రలో శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి ఆకట్టుకున్నారు.
ఫైనల్లీ:
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా ఆలోచింపజేసే సినిమా. తప్పక చూడాల్సిన సినిమా.
తెలుగుమిర్చి రేటింగ్: 3/5

