Show Time Review

Movie : Show Time
Star Cast : Naveen Chandra, Kamakshi Bhaskarla, Raja Ravindra, Naresh and others
Director : Madhan Dakshinamurthy
Producer : Kishore Garikapati
TeluguMirchi Rating : 3/5
రివ్యూ : షో టైం – కథ చిన్నదే.. కానీ టెన్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ బిగ్ స్క్రీన్ లెవెల్!”
అనిల్ సుంకర సమర్పణలో, స్కై లైన్ మూవీస్ పతాకంపై కిషోర్ గరికిపాటి నిర్మించిన “షో టైమ్” అనే సినిమా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో రూపొందింది. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన ఈ థ్రిల్లర్ జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్‌కు ముందే ప్రీమియర్ షోలు పెట్టిన మేకర్స్, సినిమాపై మంచి నమ్మకంతో ఉన్నారని స్పష్టమవుతోంది. మరి ఈ షో టైమ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?
కథ సారాంశం:
ఒక రాత్రి 11 గంటల సమయంలో, ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు సరదాగా సమయాన్ని గడుపుతుంటారు. ఈ సమయంలో అక్కడ శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయంటూ CI లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) వార్నింగ్ ఇస్తాడు. అక్కడే సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి భాస్కర్ల) సీఐతో వాగ్వాదంలో పడతారు. ఈ వాగ్వాదం సీరియస్ మలుపు తిరిగే సమయంలో కథ ఉత్కంఠగా మారుతుంది. ఈ కేసు నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? వారిని లాయర్ వరదరాజులు (వీకే నరేష్) ఎలా రక్షించాడన్నది తెరపై చూడాలి.
విశ్లేషణ:
ఇది మొత్తం ఒకే రోజులో, ఒక్క ఇంటిలో జరిగే కథ. దర్శకుడు మదన్ ఈ సింపుల్ కథను చాలా నెయిట్‌గా ప్రెజెంట్ చేశాడు. మొదటి భాగాన్ని కేవలం 45 నిమిషాల్లో ముగించి, అసలు ప్లాట్‌ను సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ చేశాడు. నరేష్ ఎంట్రీ తర్వాత సినిమాకు ప్రత్యేక శక్తి చేకూరుతుంది. అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. అదే సమయంలో సస్పెన్స్‌ను జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. అలా హాస్యం, థ్రిల్లును సమతౌల్యంగా మిక్స్ చేయడం బలమైన పాయింట్.
ఇలాంటి ఒక ఇంటిలో నడిచే కథలు మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి ప్రయోగానికి తెలుగు సినిమా ప్రయత్నం చేసిన ఈ సినిమా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. గవిరెడ్డి శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ చమత్కారంగా ఉన్నాయి. రాజా రవీంద్ర, నరేష్ మధ్య సీన్స్ సినిమాకే హైలైట్. చివర్లో క్లైమాక్స్ కూడా ఊహించని కోణంలో వెళ్లడం సినిమాకి ప్లస్.
నటీనటుల నటన:
నవీన్ చంద్రకు ఇలాంటి ఇంటెన్స్ పాత్రలు కొత్తకాదు, ఈజ్‌తో చేశారు. కామాక్షి తక్కువ స్కోప్ ఉన్నప్పటికీ మెప్పించింది. నరేష్ తనదైన స్టైల్‌లో కామెడీతో ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. రాజా రవీంద్ర సైకో పోలీస్‌గా భయపెట్టాడు. జెమిని సురేష్ హాస్యంగా పనిచేశారు. శేఖర్ చంద్ర సంగీతం మూడ్ బాగానే లిఫ్ట్ చేసింది. కెమెరా పనితనం ఓకేగా ఉంది. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి.
ముగింపు:
ఒకే ఇంటిలో నడిచే కథ, కాంపాక్ట్ నెరేషన్, హాస్యం – థ్రిల్లర్ మిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందీ “షో టైమ్”. నవ్వించడంతో పాటు ఉత్కంఠ పుట్టించడంలో టీమ్ విజయవంతమైంది.
TeluguMirchi Rating : 3/5
