
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన ప్రియదర్శి పులికొండ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సుయోధన’లో సాయికుమార్, ప్రేమ కీలక పాత్రల్లో నటించగా, వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మార్చి 27న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.
కథ : వరుణ్ (ప్రియదర్శి) ఒక ఫోలీ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచే అతనికి “సుయోధన” అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో అతనికి దుర్యోధనుడి రూపం కనిపించడం అతని జీవితాన్ని కలవరపెడుతుంది. తండ్రి (సాయికుమార్) రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో, అనుకోకుండా జరిగే మర్డర్ అటెంప్ట్‌లో ఆయన చనిపోవడం కథను మరింత మిస్టరీగా మారుస్తుంది. వరుణ్ తండ్రిని చంపింది ఎవరు?, ఇందులో పొలిటికల్ కోణం ఏంటి?, సుయోధన అనే శబ్దం తనకు ఎందుకు వినబడుతుంది?, సినిమాలో అసలు సుయోధన ఎవరు? అన్నది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ : ‘సుయోధన’లో ఫోలీ ఆర్టిస్ట్ అనే కాన్సెప్ట్ టాలీవుడ్‌కు కొత్తగా అనిపిస్తుంది. శబ్దాల ద్వారా కథను ముందుకు తీసుకెళ్లడం సినిమా ప్రత్యేకత. స్క్రీన్‌ప్లేలో ట్విస్టులు, సౌండ్ ఎఫెక్ట్స్ సినిమా థ్రిల్‌ను పెంచాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ సినిమాకు పెద్ద ప్లస్. అయితే మొదటి భాగంలో కొంత ల్యాగ్ అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకా బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు :
ప్రియదర్శి పులికొండ – తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లలో ఒకటి ఇచ్చాడు
సాయికుమార్ – దుర్యోధనుడి పాత్రలో అదరగొట్టారు
ప్రేమ – తల్లి పాత్రలో ఎమోషనల్‌గా మెప్పించారు
ద్రిషిక చందర్ – మంచి సపోర్టింగ్ రోల్
ఇతర నటీనటులు కూడా కథకు తగ్గట్టు నటించారు
ప్లస్ పాయింట్స్ :
కొత్త కాన్సెప్ట్ (Foley Artist బ్యాక్‌డ్రాప్)
సౌండ్ డిజైన్ & బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ప్రియదర్శి, సాయికుమార్ నటన
ట్విస్టులు
మైనస్ పాయింట్స్ :
మొదటి భాగంలో ల్యాగ్
ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంచెం వీక్
ఫైనల్ వర్డిక్ట్ :
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, కొత్త కాన్సెప్ట్‌తో మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ‘సుయోధన’ మంచి ఎంపిక.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
