Site icon TeluguMirchi.com

రివ్యూ : ఉస్తాద్ భగత్ సింగ్

Ustad bhaghat singh review
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా, శ్రీలీల- రాశీ ఖన్నా హీరోయిన్లుగా Harish Shankar దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ: తెలంగాణ ముఖ్యమంత్రి (కేఎస్ రవికుమార్)ని దుండగులు అటాక్ చేయడంతో, ఆయన చికిత్స కోసం సింగపూర్ వెళ్తారు. ఈ క్రమంలో నల్ల నాగప్ప (పార్థిబన్) ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎంపికవుతాడు. అతని కుమారుడు (కిల్లి క్రాంతి) ఒక అటవీ ప్రాంతానికి వెళ్లి, అక్కడ అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) చేతికి చిక్కుతాడు. అతను చేసిన అరాచకాలకు గాను పవన్ కళ్యాణ్ అతన్ని బందీగా ఉంచుతాడు. అయితే, అతన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు టెర్రరిస్టుల సాయం తీసుకుంటాడు నల్ల నాగప్ప. ఈ క్రమంలో కొంతమంది టెర్రరిస్టులు ఆపద్ధర్మ సీఎం కుమారుడిని రక్షించేందుకు అటవీ ప్రాంతానికి వెళ్తారు. అయితే ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి టెర్రరిస్టులు ఎందుకు సాయం చేశారు? అసలు ఉస్తాద్ భగత్ సింగ్ అతన్ని ఎందుకు తన కంట్రోల్ లో ఉంచుకున్నాడు? హత్యాయత్నానికి గురైన ముఖ్యమంత్రికి, భగత్ సింగ్ కి ఉన్న లింక్ ఏమిటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ సినిమాకి ప్రధాన బలం

సెకండ్ హాఫ్‌లో వచ్చే మాస్ సీన్స్, క్లైమాక్స్ ట్విస్టులు ఆకట్టుకుంటాయి

ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసిన వింటేజ్ మూమెంట్స్, పాటల మిక్సింగ్ హైలైట్

యాక్షన్ ఎపిసోడ్స్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి

నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ మంచి స్థాయిలో ఉన్నాయి

మైనస్ పాయింట్స్:

కథ, కథనం పూర్తిగా రొటీన్‌గా అనిపించడం

ఫస్ట్ హాఫ్‌లో ఎంగేజింగ్ సీన్స్ తక్కువగా ఉండటం

హీరో ఇంట్రో మరియు కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం

విలన్ క్యారెక్టరైజేషన్ ఇంకా బలంగా ఉండాల్సింది

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేదు

నటీనటుల ప్రదర్శన:

Pawan Kalyan తనదైన స్టైల్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాత్రలో అదరగొట్టాడు. ఆయన ఎనర్జీ, మేనరిజమ్స్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తాయి. శ్రీలీల సెకండ్ హాఫ్‌లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. రాశీ ఖన్నా గ్లామర్ పాత్రలో పరిమితంగా కనిపించినా తన పాత్రకు న్యాయం చేసింది. కేఎస్ రవికుమార్, పార్తీబన్ వంటి నటులు తమ పాత్రలకు సరిపోయేలా నటించారు.

ఫైనల్ వెర్డిక్ట్:

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తి స్థాయిలో ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. కథలో కొత్తదనం లేకపోయినా, పవన్ కళ్యాణ్ ఎనర్జీ, సెకండ్ హాఫ్ మాస్ మూమెంట్స్ సినిమాను నిలబెట్టాయి. ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌గా, సాధారణ ప్రేక్షకులకు ఓకే అనిపించే సినిమా ఇది.

తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5

Exit mobile version