Site icon TeluguMirchi.com

ఆర్ఆర్ఆర్ లో సముద్ర ఖని రోల్ ఇదేనా..?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు కోలీవుడ్ నటుడు సముద్రఖని , హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

యావత్ సినీ అభిమానులు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ మూవీ లో సముద్ర ఖని రోల్ పై ఓ ఆసక్తికర కథనం చక్కర్లు కొడుతుంది. ఆర్ ఆర్ ఆర్ హీరోయిలైన ఎన్టీఆర్ మరియు చరణ్ లకు సహాయకుడిగినా ఆయన పాత్ర ఉంటుందట. ప్రత్యర్థులపై కొమరం భీమ్, అల్లూరి చేసే పోరాటాలలో వారికి సహాయం చేసే వాడిగా సముద్ర ఖని పాత్ర ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజమా కదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

Exit mobile version