Site icon TeluguMirchi.com

కరోనా టెస్ట్ వద్దంటున్న సీనియర్ నటి..

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు..కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారి పంజా మాత్రం తగ్గడంలేదు. పేద , ధనిక , సినీ , రాజకీయ , క్రీడా ఇలా ఏ బేధం లేకుండా అందర్నీ భయపెడుతుంది. ఇక బాలీవుడ్ లోనూ కరోనా కలకలం సృష్టిస్తుంది.

ఇప్పటికే బిగ్ బి అమితాబ్, అయన కుమారుడు అభిషేక్ కరోనా బారిన పడగా…తాజాగా సీనియర్ నటి రేఖ సెక్యూరిటీ గార్డ్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు రేఖకు కూడా పరీక్షలు చేసేందుకు వెళ్లగా ఆమె కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించారు. కనీసం బంగ్లాను శానిటైజేషన్ చేసేందుకు కూడా అనుమతించలేదు.

కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు రేఖ తిరస్కరించారని బీఎంసీ మెడికల్ ఛీప్ సంజయ్ తెలిపారు. రేఖ మేనేజర్ ఫర్జానా డోర్ వెనక నిలబడి తమతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అయితే తాను రేఖతో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. తనకు కరోనా లక్షణాలు లేవని చెప్పారని.. ఒకవేల కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటానని ప్రామిస్ చేశారని తెలిపారు.

Exit mobile version