Site icon TeluguMirchi.com

కరోనా ను ఏమాత్రం లెక్క చేయని సుదీప్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి ఏ స్థాయి లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. కరోనా తాకిడికి జనాలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు వెళ్లడం లేదు. అలాంటిది ఈగ ఫేమ్ సుదీప్ మాత్రం కరోనా ను ఏమాత్రం లెక్క చేయకుండా తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు.

హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ఫాంట‌మ్ అనే సినిమాని ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌తి స‌భ్యుడు కూడా కోలీవుడ్ ఫిలిం ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారే అని కూడా సుదీప్ పేర్కొన్నాడు. తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోలో చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, త‌న అనుభ‌వాన్ని ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. ఈ రోజు మేక‌ప్ వేసుకోవ‌డం అద్భుత‌మైన అనుభూతి. అభిరుచికి దూరంగా ఇన్నాళ్ళు సెల‌వులో ఉన్నాను. సినిమా అనేది నా అభిరుచి. కాబ‌ట్టి మ‌ళ్ళీ షూటింగ్‌లో జాయిన్ అయ్యాను అంటూ సుదీప్ పేర్కొన్నారు. షూటింగ్‌కి సంబంధించిన వీడియో కూడా షేర్ చేశారు.

Putting on makeup today was an awesome feel. Felt I was in an elaborated holiday away frm my passion. A passion called cinema.
So here iam…..
being,,,,,,, VIKRANTH RONA ,,,again.#PhantomBegins pic.twitter.com/eoxNqpP3sn— Kichcha Sudeepa (@KicchaSudeep) July 19, 2020

Exit mobile version