Site icon TeluguMirchi.com

గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన రష్మిక

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు.

గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత శనివారం జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత రష్మిక కు సామ్ ఛాలెంజ్ విసరగా..గురువారం రష్మిక ఛాలెంజ్ ని పూర్తి చేసింది.

తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది . ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది రష్మిక . ఈ సందర్భాంగా రష్మిక మాట్లాడుతూ.. ఈ చాలెంజ్ లోకి తనను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చింది . ఈ సందర్భంగా హీరోయిన్లు రాశి ఖన్నా , కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరింది .

Exit mobile version