Site icon TeluguMirchi.com

‘డర్టీ ‘ ట్రైలర్ వచ్చేస్తుంది..

ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే రాబట్టుకోవాలని పెద్దలు చెపుతుంటారు..ఇప్పుడు ఇప్పుడు ఎంఎస్ రాజు అదే చేస్తున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో పాటు చక్కటు కుటుంబ కథ చిత్రాలను నిర్మించిన యంఎస్‌ రాజు.. ఆ తర్వాత రెండు సినిమాలతో భారీగా నష్టపోయాడు. దాంతో సినిమాలకే దూరమయ్యాడు. చాల గ్యాప్ తర్వాత దర్శకుడి గా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. ప్రస్తుతం కుటుంబ కథ చిత్రాల కంటే బోల్డ్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం తో రాజు కూడా ఆ తరహా కథ తోనే వస్తున్నాడు.

డర్టీ హరి పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రవణ్‌ రెడ్డి టైటిల్‌ రోల్‌లో కనిపిస్తుండగా రుహానీ శ‌ర్మ .. వ‌సుదేవ అనే పాత్ర‌లో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా రెండు పోస్టర్లను రిలీజ్ చేసి ఆసక్తి నింపిన రాజు.. త్వరలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ.. ‘‘మా ‘డర్టీ హరి’ నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్త‌య్యాయి. రెండు నెల‌ల లాక్‌డౌన్ త‌ర్వాత ఇప్పుడు.. విడుదలకి సిద్ధంగా ఉంది. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. త్వరలో మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.

Exit mobile version