Site icon TeluguMirchi.com

పవర్ స్టార్ ..‘అన్నా.. నువ్వు దేవుడివన్నా’

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస చిత్రాలతో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో ..స్వయంగా RGVworld పేరిట సరికొత్త యాప్ ను సృష్టించి అందాలో వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్ , నగ్నం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్మ..ఇప్పుడు పవర్ స్టార్ టైటిల్ తో తన పవర్ ఏంటో చూపించబోతున్నాడు.

ఇందులో ప‌వ‌న్ పోలిక‌తో ఉన్న వ్య‌క్తితో లీడ్ రోల్ చేయిస్తున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌నకి సంబంధించి కొన్ని పోస్ట‌ర్స్ విడుద‌ల చేయ‌గా, వాటికి నెటిజ‌న్స్ నుండి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ప‌వ‌న్‌కి ద‌గ్గ‌రి వ్య‌క్తుల పాత్ర‌లు కూడా సినిమాలో పెట్ట‌నున్నాడు. ఇందులో భాగంగా బండ్ల గ‌ణేష్ పాత్ర‌ని ఆర్జీవి చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ‘అన్నా.. నువ్వు దేవుడివన్నా, వచ్చే ఎన్నికల్లో విజయం మనదే.. నీకు తిరుగులేదు’ అంటూ డైలాగ్‌తో బండ్ల గ‌ణేశ్ పాత్ర‌లో ఆర్జీవీ సంద‌డి చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. మ‌రి ఇందులో నిజమెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Exit mobile version