
వర్మ ఐడియానే ఐడియా పో…లాక్ డౌన్ వేళ సొంతం గా ATT ద్వారా తక్కువ ఖర్చు తో కేవలం తన ట్విట్టర్ ద్వారా సినిమా ప్రమోషన్ చేస్తూ భారీ లాభాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే నగ్నం , క్లైమాక్స్ చిత్రాలతో గట్టిగానే వెనకేసుకున్న వర్మ..ఇప్పుడు పవర్ స్టార్ తో ఇంకాస్త లాభాలు దక్కించుకునేందుకు ప్లాన్ చేసాడు. మొన్నటి వరకు సినిమా చూడాలంటే డబ్బులు చెల్లించాలి. కానీ ఇప్పుడు ట్రైలర్ చూడాలన్న డబ్బులు చెల్లించాల్సిందే అనే ప్లాన్ లో ఉన్నాడట.
ఈ మేరకు పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే ఒక్కో వ్యూ కోసం 10 రూపాయలు చెల్లించాలని, ఆ దిశగా ప్రస్తుతం వర్మ అడుగులు పడుతున్నాయని ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఇదే జరిగితే సినిమా ప్రమోషన్‌గా చెప్పుకునే ట్రైలర్‌కి కూడా డబ్బులు వసూలు చేసిన ఏకైక వ్యక్తి వర్మనే అవుతాడు. ఏదేమైనా మనోడి కొత్త బిజినెస్ ఐడియాలు షాక్ అవుతున్నారు.
