Site icon TeluguMirchi.com

ఫాన్స్ తో నిహారిక సరదా కబుర్లు

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన ‘సూర్యకాంతం’ సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. దీంతో తన పద్దతిని మార్చేసి గ్లామర్ యాంగిల్ లో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా లో తనలోని హాట్ నెస్ ని బయట పెట్టడం స్టార్ట్ చేసి ఆకట్టుకోగా..తాజాగా తనకు కాబోయే భర్త ను పరిచయం చేసింది.

ఇదిలా ఉంటె తాజాగా నిహారిక అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీ ముఖంపై పింపుల్‌ గమనించా అంటూ కామెంట్ చేసాడు. దీనికి నిహారిక స్పందిస్తూ.. కంగ్రాట్స్ నీకో అద్భుతమైన అవార్డు ఇంటికి పంపిస్తా అని సరదాగా కామెంట్ చేసింది. మరో నెటిజన్ మీ ఫోన్ వాల్ పేపర్ పై ఏ ఫోటో పెట్టుకున్నారని ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో దిగిన వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని తెలిపింది. దాంతో అభిమానులతో కాసేపు సరదగా ముచ్చటించింది.

Exit mobile version