
డైరెక్టర్ పూరి ..ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి కాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం కొనసాగుతుండటంతో ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలో అర్ధం కాక చిత్ర యూనిట్ ఉంది. ఇదిలా ఉంటె ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ మూవీ లో డాన్ గా సునీల్ శెట్టి, డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారట. అయితే సునీల్ షెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.
