
సినీ నటులు ఎప్పుడు షూటింగ్ లతో క్షణం తీరిక లేకుండా..కనీసం ఫ్యామిలీ సభ్యులతో గడిపేందుకు కూడా టైం సరిపోదు. అలాంటిది కరోనా కారణంగా గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడం తో షూటింగ్ లలో పాల్గొనేందుకు భయపడుతున్నారు.
తాజాగా బన్నీ చాల బోర్ గా ఉందని చెప్పుకొచ్చాడు. 365రోజులూ తీరిక లేకుండా గడిపే జీవితంలో ఒక్కసారి నెలలతరబడి గ్యాప్ వస్తే మానసికంగా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏమి చేయాలో తెలియక చిరాకేస్తుంది. ఎంత ఫ్యామిలీతో గడిపినా…ఇష్టమైన జ్ఞాపకాలతో మునిగిపోయినా అది కొంత సేపే.సమయం గడవాలంటే పని ఉండాల్సిందే అని తెలిపాడు.
