
బోయపాటి శ్రీను – బాలకృష్ణ కలయికలో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు రావడం తో ఈ మూవీ ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మరోపక్క గత కొంతకాలం గా బాలయ్య సినిమాలేవీ కూడా హిట్స్ కాకపోయేసరికి ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బాలయ్య చూస్తున్నాడు.
ఈ మూవీలోని బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష స్పందన దక్కించుకుంది. కాగా ఈ మూవీలో బాలయ్య అఘోరగా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. దాదాపు అరంగంట వరకు కొనసాగే అఘోర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అన్నమాట వినిపిస్తుంది. ఆ పాత్ర నేపథ్యం కూడా చాల ఆసక్తికరంగా బోయపాటి రాసుకున్నారట. ఆధ్యాత్మికతతో అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట. ఈ పాత్ర బాలయ్యకు చాల కొత్తగా ఉంటుందట. గతంలో బాలయ్య ఎప్పుడూ ఇలాంటి పాత్రలో నటించలేదు. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య కవలలుగా కనపడబోతున్నాడు.
