Site icon TeluguMirchi.com

మునిసిపల్‌ శాఖ : 60 ఏళ్లకు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర రూపం లో ఉండడం తో పలు సంస్థలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యముగా చిన్న పిల్లలకు , 60 ఏళ్లకు పైబడిన వారికీ కరోనా ఎక్కువ గా వస్తుండడం తో వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది కేంద్రం. తాజాగా మునిసిపల్‌ శాఖ 60 ఏళ్లకు పైబడిన వారిని విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించింది.

60 ఏళ్లకు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల నుంచి ఎవరినైనా విధుల్లోకి తీసుకోవచ్చని వర్క్‌ ఏజెన్సీలకు మునిసిపల్‌ శాఖ సూచించింది. కొత్తగా పనిలోకి తీసుకునే కార్మికుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండేలా చూడాలని ఆదేశించింది. కుటుంబ సభ్యులు అందుబాటులో లేనిపక్షంలో ఇతరులను ఎంపిక చేయాలని మున్సిపల్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version