
లాక్ డౌన్ సినీ స్టార్స్ లలో కొత్త కోణాన్ని బయటకు తీస్తుంది. గత మూడు నెలలు గా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం తో సినీ స్టార్స్ ఇంటికే పరిమితమయ్యారు. ఓ నెల రోజు ఆలా ఇంట్లోనే గడిపిన వీరు..ప్రస్తుతం తమకు నచ్చిన పనిని చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. కొంతమంది కథలు రాస్తుంటే..మరికొంతమంది కథలు వింటున్నారు. ఇంకొంతమంది రైతులుగా మారుతున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సైతం రైతుగా మరి చెమట చిందిస్తున్నాడు.
లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సల్మాన్ ఖాన్ సిటీ ఔటర్ లోని పన్వెల్ ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారు. తన బసలో ప్రకృతి జీవనానికి అలవాటు పడ్డాడు. ఆ పనినే అదే పనిగా ఆస్వాధిస్తున్నాడు. ఆరంభం కొన్నిరోజుల పాటు గాళ్ ఫ్రెండ్స్ తో ఫామ్ హౌస్ లో ఫుల్ జాలీగా గడిపేసిన భాయ్ ఆ తర్వాత అసలైన పనిలోకి దిగాడు. పొలం పనిపై మక్కువ పెంచుకున్నాడు. బాగా నీరు చేరిన పొలంలో దమ్ము పట్టిన బురదలో దిగి వరి నాట్లు కూడా వేశాడు భాయ్. ఇదిగో ఇలా స్వేదం చిందిస్తూ బురుద పులుముకుని రోజంతా పని చేశాడట పాపం.
తన పొలంలో ఒక కఠోరమైన రోజు అలా గడిచిపోయింది. ఆ సంగతిని వెల్లడిస్తూ ఇదిగో ఇలా ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “రైతులందరికీ గౌరవం ఇవ్వండి ..“ అనే క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోని రైతులందరికీ అంకితమిచ్చాడు.
