
పెళ్లి చూపులు చిత్రం తో హీరోగా సత్తా చాటిన విజయ్ దేవరకొండ..ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం తెరపై మాత్రమే కాక సోషల్ మీడియా లోను తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయర్స్ ను ఏర్పరచుకొని నిత్యం అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ క్రేజీ హీరో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 8 మిలియన్స్ కి చేరింది. అంటే ఏకంగా 80లక్షల మంది ఈ హీరోని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. ఈ ఫాలోయర్స్ చాలు విజయ్ క్రేజ్ ఎలా ఉందొ చెప్పడానికి.
ప్రస్తుతం పూరి డైరెక్షన్లో విజయ్ ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు.
