Site icon TeluguMirchi.com

షకీలా సినిమా నగ్నం కన్నా తక్కువే

థియేటర్స్ బంద్ కావడం తో అంత ఓటిటికి అలవాటుపడ్డారు. దీంతో ఓటిటి సంస్థలన్నీ క్రేజీ చిత్రాలను దక్కించుకుంటూ రిలీజ్ చేస్తూ అలరిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అవ్వగా..ఇక ఇప్పుడు శృంగార తార షకీలా చిత్రం ఓటిటి లో రిలీజ్ కు సిద్ధమైంది. సుధీర్ఘ విరామం తరవాత మరో అడల్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు షకీలా. ఆమె నటించడమే కాకుండ సినిమాను సమర్పిస్తున్నారు. షకీలా సమర్పణలో రమేష్ కావలి, విక్రాంత్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’. దర్శకుడు సాయిరామ్ దాసరి తెరకెకించిన అడల్ట్ కామెడీ హారర్ సినిమా ఇది.

సెన్సార్ వివాదంతో గడిచిన సంవత్సర కాలంగా థియేటర్ రిలీజ్‌కి నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఆన్‌లైన్‌లో విడుదలకానుంది. జులై 20న www.ladiesnotallowed.com అనే వెబ్‌సైట్‌లో ఈ చిత్రం విడుదలవుతోంది. సినిమా చూసేందుకు 50 రూపాయలు చెలించాల్సి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. అంటే, రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాల కంటే చాలా తక్కువ ధరకే ఈ అడల్ట్ మూవీని అందిస్తున్నారు.

Exit mobile version