Site icon TeluguMirchi.com

సెప్టెంబర్ 2న పండగే పండగా..

Pawan fans records

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏడాది పవన్ పుట్టిన రోజును చాల గ్రాండ్ గా చేస్తుంటారు అభిమానులు. పలు సేవ కార్య క్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక ఏడాది కూడా అంతకు మించి చేయాలనీ ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారు. కాగా అదే రోజు పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రాల తాలూకా అప్ డేట్స్ వస్తున్నాయట.

పవన్ పుట్టిన రోజున ‘వకీల్ సాబ్’ టీజర్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో పవర్ స్టార్ బర్త్ డే ట్రెండ్ చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు పవర్ స్టార్ మూవీస్ అప్డేట్ వస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

Exit mobile version