
అరుంధతి చిత్రంతో పశుపతి గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సోను సూద్..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడి సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కూలీలా కోసం సోను చేస్తున్న మంచి పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్కడితోఆగకుండా.. లాక్ డౌన్ సమయంలో వివిధ ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడ్డ వలన కార్మికుల కుటుంబాలకి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు సోనూ సూద్. ఆయన సేవలని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.
