
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అతని సోదరుడు స్నేహాశీష్ గంగూలీకి తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో సౌరవ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే బెంగాల్ ఫస్ట్క్లాస్ మాజీ ఆటగాడైన స్నేహాశీష్ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు.
దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేర్చారు. ‘గత కొద్దిరోజుల నుంచి స్నేహాశీష్ జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని’ క్యాబ్ అధికారి ఒకరు తెలిపారు.
