Site icon TeluguMirchi.com

ఆది హీరోగా పాన్ ఇండియా చిత్రం..

ప్రేమ కావాలి చిత్రంతో హీరోగా ఇండస్ట్రీ కి పరిచమైన ఆది సాయి కుమార్..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత లవ్లీ , సుకుమారుడు సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం వరుస ప్లాప్స్ అందుకుంటూ వస్తున్నాడు. తాజాగా పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

య‌స్.వి.ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.య‌‌స్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న‌ ఈ చిత్రాన్ని య‌స్‌.వి.ఆర్ నిర్మిస్తున్నారు. ఇది వ‌ర‌కు ఆది సాయికుమార్ చేసిన చిత్రాల‌కు భిన్నంగా కామిక్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది. మేక‌ర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టారు. ప‌క్కా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్ట‌ర్1 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

Exit mobile version