
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకోవడంతో ఇండస్ట్రీ లో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఆయన మానసిక వేదనకు కారణమైన వారిని టార్గెట్ కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఉన్న ఈ అణచివేత స్వభావాన్ని లేవనెత్తుతూ సల్మాన్ మరియు అతని కుటుంబం నా కెరీర్ ని నాశనం చేశారని డైరెక్టర్ అభినవ్ కశ్యప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.
2010లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ చిత్రానికి అభినవ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా 2012లో దబాంగ్ 2 రాగా ఆ ప్రాజెక్ట్ నుండి అభినవ్ కశ్యప్ ని తొలగించారు. ఆ సినిమాకు సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు తన కెరీర్‌ను నాశనం చేశారని అభినవ్ కశ్యప్ ఆరోపించాడు.సల్మాన్ సొదరులు అర్బాజ్, సోహైల్ ఖాన్ లు నన్ను బెదిరించే వారని, భయపెడుతూ మెస్సెజ్ లు పెట్టేవారని ఆయన తెలిపారు.
