Site icon TeluguMirchi.com

ఆచార్య లో ఆ 25 నిముషాలు ఓ రేంజ్ లో ఉంటుందట

Acharya shoot

చిరంజీవి – కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. పలు కారణాలతో రిలీజ్ బ్రేక్ పడుతూ వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 29 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో సినిమా తాలూకా కొన్ని సన్నివేశాల గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అన్వేశ్ రెడ్డి.. చిరు – చరణ్ కలిసి కనిపించే సమయం 25 నిమిషాల వరకు ఉంటుందని ఆ 25 నిమిషాలు సిల్వర్ స్క్రీన్ మీద మెగా హీరోలను చూస్తుంటే కన్నుల పండుగగా అనిపిస్తుందని తెలిపారు. అంతేకాదు, ఈ సన్నివేశాలు చూస్తుంటే అభిమానులకు థియేటర్స్‌లో పూనకాలొచ్చేస్తాయని అన్నారు. దాంతో గత కొన్ని నెలలుగా ‘ఆచార్య’ సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపు అయింది.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో చిత్రం తెరకెక్కింది. మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సందేశాత్మక కథాంశంతో చిత్రం తెరకెక్కింది.

Exit mobile version