Site icon TeluguMirchi.com

ఆహా ప్లాన్ మారింది..

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా ప్రొడ్యూసర్ గా ఎంతో గుర్తింపు ఉన్న అల్లు అరవింద్ తాజాగా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ సంస్థలు మార్కెట్ లో ఓ రేంజ్ లో లాభాలు గడిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆల్ట్ బాలాజీ భార‌తీయ డిజిట‌ల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కూడా సొంతం గా ‘ఆహా’ పేరిట డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు.

అరవింద్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మొదట ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ను పెట్టారు. వెబ్ సిరీస్ లు మరీ వల్గర్ గా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. దాంతో ఆహా పై ఇది పెద్దలకు మాత్రమే అనే ముద్ర పడిపోయింది. ఆ కారణంగా బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే వాదన వినిపిస్తుంది. ఆ కారణంగానే అల్లు వారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇకపై ఆహాలో బోల్డ్ కంటెంట్ కు చోటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే వెబ్ సిరీస్ లు మరియు ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన స్క్రిప్ట్ లను మాత్రమే పరిశీలిస్తున్నారట.

Exit mobile version