Site icon TeluguMirchi.com

అలియా తప్పుకుందా..?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భాంగా చరణ్ తాలూకా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

ఇదిలా ఉంటె ఈ మూవీ లో చరణ్ కు జోడిగా నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ చిత్రం నుండి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాంచరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అలియా భట్ ఒలీవియా మోరిస్ వారి సరసన నటిస్తున్నారు. అయితే అలియా భట్ సినిమాలు బీహార్ రాష్ట్రంలో విడుదల కానివ్వమని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్ కంగారు పడుతుందట. బీహార్ ప్రజలు తెలుగు సినిమాలను కూడా ఆదరిస్తారు. ఇప్పుడు ఇలా అలియా సినిమాలు బ్యాన్ చేస్తారనే సరికి బీహార్ రాష్ట్రములో ఆర్ఆర్ఆర్ కూడా విడుదల అయ్యే అవకాశం లేదు. అలియా వలన బీహార్ మార్కెట్ లాస్ వస్తుందని చిత్రయూనిట్ భావిస్తుంది.

Exit mobile version