Site icon TeluguMirchi.com

అల్లు అర్జున్ తర్వాత మహేష్..ప్రభాస్

అలవైకుంఠపురం లో చిత్రం అల్లు అర్జున్ కెరియర్ నే పూర్తి గా మార్చేసింది. అప్పటివరకు రెండు భారీ ప్లాపులతో ఉన్న బన్నీ..ఈ మూవీ తో ఏకంగా నాన్ బాహుబలి రికార్డు నే బ్రేక్ చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా జ‌రిగిన ప్రైవేట్ స‌ర్వేలో అల్లు అర్జున్‌కి మొద‌టి ప్లేస్ ద‌క్క‌గా ఆ త‌ర్వాతి స్థానాల‌లో మ‌హేష్ , ప్రభాస్ ఉన్నారు. ఇక రంగ‌స్థ‌లం వంటి భారీ హిట్ కొట్టిన చ‌ర‌ణ్ ..నానీ,విజయ్ దేవరకొండ తర్వాత ఉండ‌డం గ‌మ‌న‌ర్హం. ఈ సర్వే చూసిన మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా..దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version