Site icon TeluguMirchi.com

‘అనగనగా ఒక రోజు’ ఆ స్టిల్ ఇదే

లాక్ డౌన్ వేళ వర్మ అభిమానులు , సినీ ప్రేక్షకులనే కాదు తన సీనియామాల్లో నటించిన నటి నటులను సైతం సంతోష పెడుతున్నారు. నిత్యం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే వర్మ తన సినిమా ప్రొమోషన్లే కాక తన సినిమాల తాలూకా ఓల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాను డైరెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రోజు’ సినిమాకి సంబంధించి చివరి షూటింగ్ పిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి తనలోని ఓ జ్ణాపకాన్ని బయటపడ్డాడు.

‘అనగనగా ఒక రోజు’ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా 1996 లో వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే.. జె. డి. చక్రవర్తి, ఊర్మిళ పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. వీరి ప్రేమను అంగీకరించరు. వారిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు. మధ్యలో వారికి ఎన్నో అవాంతరాలు వీటన్నింటినీ అధిగమించి చివరకు ఎలా బయటపడతారన్నదే మిగతా కథ. ఈ సినిమాలో బ్రహ్మానందం మైఖేల్ జాక్సన్ అనే దొంగగా నటించాడు. పోలీసులను తప్పించుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు మంచి హాస్యాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం నటనకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.

Exit mobile version