
బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మ..ఆ తర్వాత కోహ్లీ తో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓ పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ అందరిని అలరిస్తుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కేక పుట్టించే బికిని పోజ్ లతో సెగలు పుట్టిస్తుంటుంది.
తాజాగా `వోగ్` మేగజీన్ కోసం అనుష్క బికినీతో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందన ఆసక్తికరంగా మారింది. అనుష్క ఫొటోపై కోహ్లీ ఎలాంటి కామెంట్ చేయకుండా ఎమోషనల్ ఏమోజీలను పోస్ట్ చేశాడు. అనుష్క ఫొటో అద్భుతం అని హార్ట్ ఐ ఎమోజీలను పోస్ట్ చేశాడు.
