Site icon TeluguMirchi.com

ఏపీ కరోనా అప్డేట్ : రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా తగ్గాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టి ప్రజల్లో ఊరట కలిగించాయి. గడిచిన 24 గంటల్లో 53,026 శాంపిల్స్ పరీక్షించగా మరో 8943 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 273085కు చేరింది. గడచిన 24 గంటల్లో 97మంది చనిపోయారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 762, చిత్తూరులో 987, తూర్పు గోదావరిలో 1146, గుంటూరులో 527, కడపలో 530, కృష్ణాలో 338, కర్నూలులో 956, నెల్లూరులో 669, ప్రకాశంలో 300, శ్రీకాకుళంలో 547, విశాఖలో 885, విజయనగరంలో 548, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటిన్ లో తెలిపారు.

Exit mobile version