Site icon TeluguMirchi.com

Arjun Chakravarthy : కబడ్డీ ప్లేయర్ బయోపిక్ వచ్చేస్తోంది..!


రాబోయే చిత్రం “అర్జున్ చక్రవర్తి, జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్” ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీని గుబ్బల నిర్మాత. నటుడు విజయ రామరాజు, సిజా రోజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్ మరియు దుర్గేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

“అర్జున్ చక్రవర్తి” చిత్రం 1980లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇది ఒక క్రీడాకారుడి జీవితంలోని కష్టాలను, విజయాలను సహజంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ సాగే చిత్రం. ఈరోజు ఈ చిత్రం నుంచి విజయ రామరాజు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్.

ఫస్ట్ లుక్‌లో అర్జున్ చక్రవర్తి స్టేడియం మధ్యలో చేతిలో పతాకంతో, ముఖంలో అనుకున్నది సాధించానన్న గర్వంతో కనిపించడం చూడవచ్చు. “భారత కబడ్డీపై అర్జున్ చక్రవర్తి ప్రభావం, 1980లలో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం స్థాయిలో ఉంటుంది” అంటూ రాసిన అక్షరాలు సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. అలాగే అర్జున్ యొక్క స్ఫూర్తిదాయకమైన కథ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. త్వరలోనే వెండితెరపై ఈ అద్భుతమైన కథను చూడబోతున్నాం. క్రీడాకారుడి పాత్ర కావడంతో భారీ కసరత్తులు చేసి విజయ రామరాజు తన దేహాన్ని ఎంతో దృఢంగా మలిచారు.

ఈ సినిమా కోసం అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీ నుండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు ఈ చిత్రంలోని ప్రతి అంశం ప్రేక్షకులకు సినిమాలో లీనమయ్యేలా చేస్తూ భావోద్వేగ అనుభవాన్ని అందించేలా ఉంటుంది. విఘ్నేష్ బాస్కరన్ సంగీతం అందిస్తున్నారు. “అర్జున్ చక్రవర్తి” తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడింది. హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేయబడి, పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.

Exit mobile version