Site icon TeluguMirchi.com

కరెంట్ బిల్లు కట్టేందుకు రెండు కిడ్నీలు అమ్మేస్తానంటున్న నటుడు..

లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. మూడు నెలల వరకు ఉపశమనం కల్పించింది. విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. కొందరు ఆన్‌లైన్‌లో చెల్లించినప్పటికీ, మరికొంతమంది కట్టకుండా ఉన్నారు . కాగా ఇప్పుడు మూడు నెలల బిల్లులు ఒకేసారి తీసి ఇవ్వడం తో షాక్ అవుతున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సెలబ్రటీస్ వరకు తమకు వచ్చిన బిల్లులు వామ్మో అంటున్నారు.

తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపాడు. తన ఇంటికి 1,03,564 కరెంట్ బిల్ వచ్చిందని, నేను వేసిన పెయింటింగ్స్ కొంటే ఆ వచ్చిన మొత్తంతో విద్యుత్ బిల్ చెల్లిస్తానని ట్వీట్ చేశాడు. తర్వాతి నెల బిల్ చెల్లించేందుకు ఆ రెండు కిడ్నీలని అమ్మేందుకు సిద్ధమవుతున్నా అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు అర్షద్.

Exit mobile version