
లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. మూడు నెలల వరకు ఉపశమనం కల్పించింది. విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. కొందరు ఆన్‌లైన్‌లో చెల్లించినప్పటికీ, మరికొంతమంది కట్టకుండా ఉన్నారు . కాగా ఇప్పుడు మూడు నెలల బిల్లులు ఒకేసారి తీసి ఇవ్వడం తో షాక్ అవుతున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సెలబ్రటీస్ వరకు తమకు వచ్చిన బిల్లులు వామ్మో అంటున్నారు.
తాజాగా బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణాకు కూడా ఈ బిల్లు భారం తప్పలేదు . నెల రోజూలోనే భారీగా బిల్లు రావడం చూసి ఆయన భార్య రేణుకా సహానే మండిపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మే 9వ తేదీన నాకు రూ. 5510 బిల్ వచ్చింది. అయితే జూన్‌లో మరో బిల్ రూ. 29700 వచ్చింది. అంటే మే మరియు జూన్‌లో వచ్చిన బిల్స్‌ని పరిశీలిస్తే.. ఒక్క మే నెలకే నాకు రూ. 18080 బిల్ వేశారు. అంతకుముందు నెల రూ. 5510 వచ్చిన బిల్, ఒక్క నెలకే రూ. 18080 ఎలా అయ్యింది?” అంటూ ముంబై అదానీ ఎలక్ట్రిసిటీని ట్యాగ్ చేస్తూ మండిపడ్డారు.
