Site icon TeluguMirchi.com

ఓటిటి లోకి బేబీ.. ఎక్కడో తెలుసా..


తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకెళ్తోన్నఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇప్ప‌టికే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను అందించిన ఆహా తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ‘బేబి’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యింది. ఈ సినిమా ఆహాలో ఆగ‌స్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే క‌ల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాల పొందిన ‘బేబి’ చిత్రం త్వ‌ర‌లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌టానికి ప‌రుగులు తీస్తోంది. ఈ నేప‌థ్యంలో రూ.899లను చెల్లించిన త‌న గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు మ‌రో అపూర్వ అవ‌కాశాన్ని అందించింది ఆహా. ఈ గోల్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ ఇప్పుడు ఏకంగా 12 గంట‌లు ముందుగానే బేబి సినిమాను చూడ‌బోతున్నారు. ఈ గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్ తీసుకున్న వారు సినిమాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను చూసేట‌ప్పుడు 4K డాల్బీ ఆడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారు. ఈ స‌దుపాయం ఇటు తెలుగు, అటు త‌మిళ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోని స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు అందుబాటులో ఉంది.

సామజవరగమన, హిడింబ వంటి సినిమాలతో ఆహా తన యూజర్లను అలరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లెటెస్ట్ సెన్సేషనల్ కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి సినిమా ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమాను ఎస్ కే ఎన్ (శ్రీనివాస్ కుమార్ నాయుడు) నిర్మించగా.. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.

Exit mobile version