
అఖండ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం తన 107 మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. గత కొద్దీ రోజులుగా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. అక్కడే ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని మరో కీలక షెడ్యూల్‌ను కూడా ఇటీవలే ప్రారంభించింది. ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో.. యాక్షన్ సన్నివేశాలను.. బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై తెరకెక్కించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ యాక్షన్ షెడ్యూల్ పూర్తైనట్లు తెలిసింది. దీంతో కొత్త షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాలని మూవీటీమ్ సన్నాహాలు చేస్తోందట.
ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా..దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సిద్ధమైన ఈ కథలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది. విదేశీ నేపథ్యమూ ఇందులో ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందించారు.
