Site icon TeluguMirchi.com

బాలయ్య బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు..

Balakrishna nagababu

బాలకృష్ణ బయటకు కాస్త కోపంగా కనిపించిన మనసు మంచిదని.. అలాగే ఆయనలో సేవాగుణం కూడా ఎక్కువేనని, ఆపదలో ఉంటే అడగకుండానే సాయం చేస్తారని ఆయనను దగ్గరిగా చూసినవాళ్ళు చెబుతుంటారు. తాజాగా మరోసారి అదే రుజువు అయ్యింది. హిందూపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ కేంద్రానికి 55 లక్షల విలువైన మెడిషన్స్ ను, పిపిఇ కిట్లును, అలాగే మాస్క్ లు మరియు ఇతర సామగ్రిని విరాళంగా ఇస్తున్నారు.

ఇప్పటికే బాలయ్య కరోనా నివారణ కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఏకంగా 1.25 కోట్ల సాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలోని దాదాపు 12 వేలమందికి ఆయన మెడిషన్స్ ను అండ్ ఇతర సామగ్రిని కూడా అందజేశారు. ఇక ఎప్పటి నుండో బాలయ్య బాబు తన బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్‌ నుండి పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. ఇలా బాలకృష్ణ ఎన్నో మంచిపనులు చేస్తూ ఆకట్టుకున్నాడు.

Exit mobile version