
లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ బంద్ కావడం తో థియేటర్స్ లలో రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఓటిటి లో రిలీజ్ అవుతూ అలరిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు విడుదలై ఆకట్టుకోగా..ఈరోజు భానుమతి అండ్ రామకృష్ణ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫై రిలీజ్ అయ్యింది.యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు.
నవీన్ చంద్ర, సలోని లూత్రా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చూసి మెచ్చుకున్నారు. సినిమా చాలా బాగుందని, చాలా సింపుల్‌గా తీశారని మంత్రి తలసాని సినిమా యూనిట్‌ని మెచ్చుకున్నారు . హీరో నవీన్ చంద్ర, దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్ ములుకుట్ల, సమర్పకుడు శరత్ మరార్ మంత్రితో భేటీ అయిన వాళ్లలో ఉన్నారు.
