
విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా “బిచ్చగాడు”. ఈ సినిమా సీక్వెల్ గా “బిచ్చగాడు 2” రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది.
గతంలో విడుదలైన ఈ సినిమా థీమ్ సాంగ్ వినూత్నంగా ఉండి ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం ప్రకటన చేసింది. బిచ్చగాడు 2 చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు.
