
బిత్తిరిసత్తి ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. తనదైన శైలి యాసతో విలక్షణమైన హావభావాలను పలికిస్తూ.. యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బిత్తిరిసత్తి..తాజాగా సాక్షి ఛానల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
v6 ఛానల్ తో అందరికి పరిచమైన సత్తి..గతేడాది TV 9లో చేరాడు. అయితే అక్కడ ఏమైందో కానీ ఈరోజు సాక్షి ఛానల్ లో జాయిన్ అయ్యాడు. ఆ ఛానెల్ ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి బిత్తిరి సత్తి ఎంట్రీని స్వాగతించారు సహా ఉద్యోగులు. లాక్‌డౌన్ కారణంగా గతంలో టీవీ9 వారు అందజేసిన ప్యాకేజీ మొత్తానికే సాక్షికి సత్తి ఓకే చెప్పాడని టాక్. మరి టీవీ 9 లో పెద్దగా సక్సెస్ కొట్టలేకపోయిన సత్తి..సాక్షి లో ఏ రేంజ్ లో సందడి చేస్తాడో చూడాలి.
