
ఇండస్ట్రీ లో ఓ హీరోను మరో హీరో స్ఫూర్తి గా తీసుకోవడం కామన్..నవదీప్ సైతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను స్ఫూర్తిగా తీసుకున్నాడట. టాలీవుడ్ స్టార్ హీరోలలో మొదటిసారి సిక్స్ ప్యాక్ చూపించిన హీరో అల్లు అర్జున్. పూరి డైరెక్షన్లో దేశ ముదురు చిత్రంలో సిక్స్ ప్యాక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. కాగా ఈ విషయంలో హీరో నవదీప్ కి బన్నీనే స్ఫూర్తి అట.
ఈ మధ్య నవదీప్ కఠోరంగా శ్రమించి పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ బాడీ సాధించారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పంచుకోగా అందరూ షాక్ అయ్యారు. ఐతే నవదీప్ కష్టపడి అందమైన కర్వ్డ్ బాడీ పెంచడానికి స్ఫూర్తిని ఇచ్చింది అల్లు అర్జున్ అని చెప్పడం విశేషం. అల్లు అర్జున్ ని చూసి నవదీప్ సిక్స్ ప్యాక్ పెంచాలనే కోరిక పెంచుకున్నారట.
