Site icon TeluguMirchi.com

బన్నీని క్లిక్ మనిపించారు..

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ ప్రముఖులు కొత్త కొత్త లుక్‌లలో అభిమానులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌కు న్యూ లుక్‌ ట్రీట్‌ని ఇచ్చారు. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ వాక్‌కి వెళ్లగా.. అక్కడున్న వారు తమ కెమెరాలతో బన్నీని క్లిక్ మనిపించారు. ఈ క్రమంలో బన్నీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒత్తు జుట్టు వెనకాల చిన్న పోనీతో బన్నీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.

సంక్రాంతి బరిలో బన్నీ అల వైకుంఠపురములో చిత్రంతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు., ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించేందుకు సిద్దమవుతున్నారు. కరోనా పరిస్థితులు కాస్త సర్దుకున్నాక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా.. అతడి సరసన రష్మిక నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version