Site icon TeluguMirchi.com

బాబాయ్ బ్యానర్ లో అబ్బాయి..?

పవన్ కళ్యాణ్ బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడా..ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఓ పక్క హీరోగా , నిర్మాతగా అలాగే రాజకీయ నేత గా మూడు కోణాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేయమని తన బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ కు చెప్పాడని అంటున్నారు.

ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్లో చేయబోతున్నాడనేది ఇంకా ఖరారు చేయలేదు. త్రివిక్రమ్ మాత్రం నెక్స్ట్ ఎన్టీఆర్ తోనే సినిమా చేయబోతున్నట్లు ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర పనుల్లోనే బిజీ గా ఉనాన్డు. ఈ మూవీ తర్వాత చరణ్ తో సినిమా ఉంటుంది కావొచ్చు .

Exit mobile version