Site icon TeluguMirchi.com

చరణ్ ఆసక్తికర సందేశం ..

లాక్ డౌన్ కారణంగా సినీ స్టార్స్ అంత ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఎలా గడుపుతుంటారో సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశారు.

ఈ ఖాళీ సమయంలో ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన భారీ వర్కవుట్స్ చేస్తున్నారు. సదరు పిక్స్ షేర్ చేసిన చెర్రీ ”మెదడు జిమ్ చేయమంటోంది.. హృదయం ఇక చాలంటోంది” అంటూ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ కు అభిమానులు , నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version