
ఈరోజు అల్లు అర్జున్ , అఖిల్ అక్కినేని తో పాటు అకిరా బర్త్ డే కూడా ఈరోజు. ఈ సందర్భాంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుండి సోషల్ మీడియా లో మెగా అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు ఈ ముగ్గురికి బెస్ట్ విషెష్ అందిస్తూవస్తున్నారు.
అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ అకీరానందన్ తో మా బంధం మరింత బలపడుతుంది అంటూ అతన్ని అమితంగా ప్రేమిస్తున్నాను అని రామ్ చరణ్ ప్రేమగా తెలియజేశాడు. అంతే కాకుండా ప్రత్యేకంగా తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ట్వీట్ వైరల్ గా మారిపోతుంది. అలాగే అల్లు అర్జున్, అఖిల్ కు కూడా విషెష్ అందజేశారు.
Akira our bond becomes stronger with every passing year.. ❤️
Love you loads!!
Happy Birthday 🤗— Ram Charan (@AlwaysRamCharan) April 8, 2022
