Site icon TeluguMirchi.com

ఫైట‌ర్ స్క్రిప్ట్ ఫై ఛార్మి క్లారిటీ

డైరెక్టర్ పూరి ..ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి కాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం కొనసాగుతుండటంతో ఈ మూవీ స్క్రిప్ట్ మారుస్తున్నట్లు సోషల్ మీడియా లో వైరల్ గా న్యూస్ చక్కర్లు కొట్టడం తో నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చింది.

స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయం, చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఫైట‌ర్ స్క్రిప్ట్ బ్లాక్ బ‌స్టర్. క‌రోనా క్రైసిస్ ముగిసిన త‌ర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. సినిమాపై చాలా న‌మ్మకంతో ఉన్నాం. అతి త్వ‌ర‌లోనే చిత్ర టైటిల్ ప్ర‌క‌టించ‌బోతున్నాం అని ఛార్మీ స్ప‌ష్టం చేసింది.

Exit mobile version