Site icon TeluguMirchi.com

చిలుకూరు వెళ్లే వారు గమనించగలరు..

కరోనా వైరస్ కారణంగా దేవాలయాలు సైతం మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా మూతపడిన ఆలయాలు జూన్ 08 నుండి ఓపెన్ కాగా..చిలుకూరు టెంపుల్ సైతం ఓపెన్ అయ్యిందని భక్తులు చిలుకూరు కు రావడం తో ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ టెంపుల్ ఇంకా తెరుసుకోలేదని తేల్చి చెప్పాడు.

జూన్ 8 నుంచి ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. తిరుపతిలోనూ దర్సనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం ఇంకా తెరచుకోలేదని, లోపల మాత్రం బాలాజీకు పూజలు జరుగుతున్నాయని తెలిపారు.

Exit mobile version