Site icon TeluguMirchi.com

చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి మెగా కుమ్ముడు కుమ్మేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి అంశం పట్ల ట్వీట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు (జూన్ 14) ప్ర‌పంచ రక్తదాన దినోత్స‌వం సందర్భంగా ఓ స్పెష‌ల్ వీడియో పోస్ట్ చేస్తూ జనాలను మేలుకొలిపే మంచి సందేశమిచ్చారు.

ఒకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుందని ప్రశ్నించిన ఆయన.. ”ర‌క్త‌దానం చేసి మ‌రొక‌రి జీవితాన్ని కాపాడ‌టంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదు. ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేసి, చాలా మంది ర‌క్తం దానం చేస్తున్నార‌ని తెలిసి సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌వుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు. రక్త దానం చేయండి! ప్రాణదాతలు కండి!” అని ట్వీట్ చేసాడు.

పలు సందర్భాల్లో తాను రక్తదానం చేస్తున్నప్పటి ఫోటోలు జోడిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ‘ఠాగూర్’ సినిమాలోని ”నేను సైతం” సాంగ్ ప్లే చేస్తూ రూపొందించిన వీడియో షేర్ చేశారు చిరు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నేనుసైతం రక్తదానానికి సిద్ధం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version